తెలుగుదేశం పార్టీ కావలి నియోజకవర్గ సమావేశం లో పాల్గొన్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, పార్లమెంట్ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ అజీజ్,నియోజకవర్గ పరిశీలకులు గూడపాటి శ్రీనివాస్,పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి , సుబ్బానాయుడు, 4 మండలాల నాయకులు కార్యకర్తలు.... 

పార్టీ సంస్థాగత ఎన్నికల నిర్వహణ, పెండింగ్ లో ఉన్న గ్రామ, వార్డు, బూత్, క్లస్టర్ కమిటీల ఏర్పాటు త్వరితగతిన పూర్తి చేసి పార్టీ పటిష్టత కై కృషి చేయాలని ఆదేశించారు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై  చేపట్టాల్సిన కార్యక్రమాలపై, గత ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ది పనుల పెండింగ్ బిల్లులపై చర్చించడం జరిగింది. త్వరలో రానున్న కావలి, అల్లూరు మున్సిపల్ ఎన్నికలకు టిడిపి శ్రేణులు సిద్ధం కావాలని నాయకులు పిలుపునిచ్చారు.