ఫుడ్ పాయిజన్ తో తీవ్ర అస్వస్థతకు గురి అయిన వెస్ట్ బెంగాల్ వాసులందరికీ మెరుగైన వైద్యం అందిస్తున్నాం - మాజీ మంత్రివర్యులు, వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి:::
✍️వరి నాట్లు వేసే కూలీలుగా వెస్ట్ బెంగాల్ ప్రాంతం నుంచి ప్రతి సీజన్లో పనులు కోసం వచ్చే కొంతమంది వలస కూలీలు కలువాయి మండలం వెరుబొట్లపల్లి గ్రామం వద్ద తాత్కాలికంగా ఉన్న పరిస్థితుల్లో ఫుడ్ పాయిజన్ వల్ల ఒకరు చనిపోవడం మరికొంత మంది తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిన వెంటనే మా విజ్ఞప్తి మేరకు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డి ఎం & హెచ్ ఓ, ఆర్ డి ఓ, DSR హాస్పిటల్ మరియు పి హెచ్ సి వైద్యులు పలువురు ఉన్నతాధికారులతో పాటు జిల్లా వైఎస్ఆర్ సీపీ అధ్యక్షులు సర్వేపల్లి శాసనసభ్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు స్వయంగా పర్యవేక్షించి సకాలంలో అన్ని చర్యలు తీసుకోవడం .. ప్రస్తుతం అందరి ఆరోగ్యం నిలకడగా ఉండేందుకు చేసిన కృషి అభినందనీయమని మాజీ మంత్రివర్యులు వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు పేర్కొన్నారు