తిరుపతి విమానాశ్రయంలో ఆదివారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. రన్‌ వే పరిశీలనకు వెళ్లిన ఫైరింజన్‌ అదుపు తప్పి బోల్తా పడింది. అయితే అదే సమయంలో హైదరాబాద్‌ నుంచి రావాల్సిన ఇండిగో విమానం లాండింగ్‌కు విమానాశ్రయ అధికారులు అనుమతి నిరాకరించారు. ఆ విమానాన్ని బెంగళూరుకు తరలించారు. మరోవైపు ఫైర్‌ ఇంజన్‌ బోల్తాపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. కొద్దిలో ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.