టీడీఎస్ (టాక్స్ డిడక్షన్ స్కీమ్) పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. 2020-21లో టీడీఎస్‌లో 25 శాతం మినహాయింపునిచ్చింది. దీనివల్ల లక్షలాది మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం 3 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకూ జీతం ఉన్న వారికి 5 శాతం టీడీఎస్ ఉంది. అలాగే 5లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకూ జీతం ఉన్న ఉద్యోగులకు 20 శాతం వరకూ టీడీఎస్ ఉంది. సంవత్సరానికి పది లక్షల రూపాయలకు మించి జీతం ఉన్న వారికి 30 శాతం టీడీఎస్ ఉంది. ఈ తరుణంలో 2020-21లో టీడీఎస్‌లో 25 శాతం మినహాయింపునిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ప్రకటించిన ఆర్ధిక ప్యాకేజీలో పంపిణీలపై వివరాలు వెల్లడించేందుకు ని
ర్మల విలేకరుల సమావేశం నిర్వహించారు.