తడ మాజీ జెడ్ పి టి సి బొమ్మన్ శ్రీధర్ కారు ప్రమాదం
♦️ తృటిలో తప్పిన పెను ప్రమాదం

తడ మాజీ జెడ్పిటిసి బొమ్మన్ శ్రీధర్, వాటం బేడు గ్రామ మాజీ సర్పంచ్ బొమ్మన్ ఏకాంబరం లు ప్రయాణిస్తున్న కారు గూడూరు ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీ క్రాస్ రోడ్డు వద్ద ప్రమాదానికి గురైన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. నెల్లూరు నుండి  సూళ్లూరుపేటకు వస్తున్న  కారు గూడూరు ఆదిశంకర కాలేజ్ సమీపంలో మలుపు వద్ద ఎదురుగా వస్తున్న హర్యానా రాష్ట్రానికి చెందిన లారీ అతివేగంతో అదుపుతప్పి ఢీ కొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న బొమ్మన్ ఏకాంబరం తీవ్ర గాయాలు కాగా శ్రీధర్ కు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గూడూరు ప్రభుత్వఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గూడూరు రూరల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.