బాత్రూమ్‌లో టీవీ నటి బలవన్మరణం

కరోనా కబళించిందా...?

ఆత్మహత్య చేసుకుందా...!

హత్య చేశారా...!

అనుమానాస్పద స్థితిలో...

టీవీ నటి రేఖ ఆకస్మిక మరణం!

కరోనా సమయంలో ప్రోగ్రామ్ లు, ఈవెంట్ లు లేక వరుసగా నాలుగు నెలల నుండి ఆర్దికంగా చితికిపోయిన ఓ కళాకారిణి బలవన్మరణానికి పాల్పడిందా..

 అవకాశాలు లేకపోవడం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న భర్త అప్పులపాలవడంతో ఒత్తిడి తట్టుకోలేక టీవీ నటి మద్దెల సబీరా, అలియాస్ రేఖ (42) ఆత్మహత్య చేసుకుందా...
పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరుకు చెందిన రేఖ నటనపై అభిమానంతో హైదరాబాద్ వచ్చి రెండు టీవీ సీరియళ్లలో నటించారు. అయితే, ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో తిరిగి గుంటూరు వెళ్లిపోయి అహ్మద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. కుమార్తె పుట్టిన తర్వాత మనస్పర్థలు రావడంతో భర్తతో విడిపోయారు. అనంతరం చైతన్యను వివాహం చేసుకున్నారు.
ప్రస్తుతం విద్యానగర్‌లో ఉంటున్న రేఖ కొన్నాళ్లపాటు వేడుకల్లో పాటలు పాడడం, యాంకరింగ్ చేయడం వంటివి చేశారు. ఈ వెంట్ మేనేజర్ గా కూడా కెరీర్ మొదలెట్టిన రెండేళ్లుగా అది కూడా మానేశారు. మరోవైపు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఆమె భర్త చైతన్య నష్టాలపాలవడంతో రేఖ కుంగిపోయారు. చుట్టుముట్టిన కష్టాలతో కలత చెందిన ఆమె నిన్న స్నానం చేసేందుకు వెళ్లి బాత్రూములోనే ఆత్మహత్య చేసుకున్నారు.
స్నానానికి వెళ్లిన భార్య ఎంతకీ బయటకు రాకపోవడంతో భర్త పోలీసులకు సమాచారం అందించారు. తలుపులు పగలగొట్టి చూడగా ఆమె ఉరి వేసుకుని వేలాడుతూ ఉండటం గమనించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు...రేఖ ఆత్మహత్యకు ప్రత్యక్షంగా కరోనా ప్రభావంతో ఆర్దిక ఇబ్బందులు కనిపిస్తుండగా పరోక్ష్యంగా మరేమైనా కారణాలు ఉండవచ్చనే కోణంలో  కూడా పోలీసులు ధర్యప్తు చేస్తున్నారు..