నెల్లూరు నగరంలోని ఆర్.డి.ఓ కార్యాలయాన్ని శుక్రవారం రాత్రి కలెక్టర్  కె.వి.ఎన్. చక్రధర్ బాబు.., డి.ఆర్.ఓ శ్రీ మల్లికార్జున్ తో కలిసి సందర్శించారు. ఆర్.డి.ఓ ఛాంబర్ లో అధికారులు, రాజకీయ పార్టీల నేతలతో సమావేశమైన కలెక్టర్..., అనంతరం ఆర్.డి.ఓ కార్యాలయ ప్రాంగణంలో ఈ.వి.ఎం లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంని పరిశీలించారు. స్ట్రాంగ్ రూం వద్ద ఉన్న సెక్యూరిటీ ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్న కలెక్టర్ భద్రతా సిబ్బంది హాజరు రిజిస్టర్ ని పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో ఆర్.డి.ఓ  హుస్సేన్ సాహెబ్, వైసీపీ నాయకులు మురళీధర్ రెడ్డి, బీజేపీ నాయకులు కామేస్వర్రావు, అధికారులు పాల్గొన్నారు.