ఇటీవలే ట్రంప్ కు కరోనా సోకింది. కరోనా బారిన పడిన ట్రంప్ కు వాల్టర్ రీడ్ మిలిటరీ ఆసుపత్రిలో అత్యున్నత చికిత్స అందించారు. నాలుగు రోజులపాటు చికిత్స పొందిన ట్రంప్ తిరిగి వైట్ హౌస్ కు చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే, కోలుకున్న తరువాత ట్రంప్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవుడి ఆశీర్వాదం వలనే తనకు కరోనా వచ్చిందని, కరోనాకు వైద్యులు అందించే అత్యున్నత చికిత్స గురించి తెలుసుకోగలిగినట్టు ట్రంప్ పేర్కొన్నాడు. తనకు అందించిన అత్యున్నత చికిత్సను దేశంలోని ప్రజలందరికి అందించేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. అదీ కూడా ప్రజలకు ఉచితంగా ఈ చికిత్స అందేలా చేస్తామని అన్నారు. ఇది అమెరికన్ ప్రజలకు గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విశేషం.