నెల్లూరు నగరంలోని స్థానిక 42 వ డివిజన్ జేమ్స్ స్కూల్ పక్కన దాదాపు 56 అంకణాలు స్థలం పార్కు కోసం కేటాయించడం జరిగింది ఈ

 స్థలం కబ్జాకు గురవుతుంది ఏ ఐ వై ఎఫ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి ఆ స్థలాన్ని కాపాడాలని అర్జీ ఇవ్వడం జరిగింది.....

ఈ సందర్భంగా ఏ ఐ వై ఎఫ్ జిల్లా కన్వీనర్ సయ్యద్ సిరాజ్ మాట్లాడుతూ స్థానిక 42 వ డివిజన్ లో ఎక్కువ శాతం మంది ముస్లింలు నివాసముంటున్న  ప్రాంతంలో ఒక పార్కు కూడా లేనందువల్ల ఇక్కడ పార్కు నిర్మించాలని చెప్పేసి మున్సిపల్ కార్పొరేషన్ వారు ఇక్కడ పార్కు స్థలాన్ని కేటాయించారు కానీ క్రమేణా ఈ స్థలం స్థానికంగా ఉండే వాళ్ళు ఇష్టానుసారంగా కబ్జా చేస్తూ పోయారు ఇప్పుడు అక్కడ దాదాపు 25 అంకణాలు మాత్రమే మిగిలి ఉంది ఈ స్థలాన్ని కూడా టీసీ కాలేషా అనే వ్యక్తి కబ్జా చేసి గోడను కూడా నిర్మించే ఈ స్థలం నాది అని అంటున్నాడు కనుక ఈ స్థలాన్ని కాపాడాలని మేము మున్సిపల్ కమిషనర్ గారిని కలవడం జరిగింది కమిషనర్ గారు సానుకూలంగా స్పందించి అక్కడ గోడ ని తొలగించి పార్కు స్థలంగా కేటాయిస్తామని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నగర కార్యదర్శి నూర్ ఖాన్. మున్నా. పటాన్ భాష. గౌస్ బాష. దస్తగిరి. తదితరులు పాల్గొన్నారు