నెల్లూరు నగరంలోని 51వ డివిజన్ కపాడిపాలెం లో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి.అనిల్ కుమార్ గారు పర్యటించి, స్థానిక సమస్యలను అడిగి తెలుసుకొని, వెంటనే సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించి,  డివిజన్ లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉండడంతో కరోనా నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాయల సురేష్ బాబు, ఏ.బాలాప్రసాద్, అరవ ఆనంద్ బాబు, కొణిదల సుధీర్, రమేష్, సరిత, ప్రమీల, చిట్టి, వందవాశి రంగా, తదితరులు పాల్గొన్నారు.