జన సేనాని పర్యటనను అడ్డుకోవద్దు.. ఏఐవైఎఫ్ నాయకులకు నోటీసులు  నాయకులతో చర్చిస్తున్న సీఐ దశరధ రామయ్య 
జన సేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పర్యటనను అడ్డుకోవద్దని ఏఐవైఎఫ్ నాయకులను పట్టణ సీఐ కోరారు. రైతు బిల్లులను రద్దు చేసేలా కేంద్రానికి సిఫార్సు చేయకుండా నివార్ తుపాన్ బాధితుల పరామర్శకు వస్తే అడ్డుకుంటామని అఖిల భారత యువజన సమాఖ్య నాయకులు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా శుక్రవారం ఉదయం ఏఐవైఎఫ్, ఏఐటీయూసీ నాయకులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా సీఐ జీ. దశరధరామారావు మాట్లాడుతూ శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని ఏఐవైఎఫ్ నాయకులకు నోటీసులు జారీ చేశామన్నారు.   పవన్ కల్యాణ్ పర్యటన ముగిసేంత వరకూ ఏఐవైఫ్ కార్యకర్తలను స్టేషన్ లోనే ఉంచారు. పవన్ పర్యటన అనంతరం ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు సునీల్ యాదాల, పట్టణాధ్యక్షులు చల్లా వెంకటేశ్వర్లు, బాలాజీ, ఏఐటీయూసీ నాయకులు యాకూబ్ లకు నోటీసులు జారీ చేశారు.