పెంచలకోనలో రెండు రోజుల పాటు స్వామి వారి దర్శనం రద్దు


ఆలయ అసిస్టెంట్ కమిషనర్ జె.వెంకటసుబ్బయ్య


పెంచలకోన పుణ్యక్షేత్రం


నెల్లూరు జిల్లాలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలో  శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహా స్వామి దేవస్థానంలో భక్తులకు రేపటి నుండి రెండు రోజులు పాటు స్వామివారి దర్శనాన్ని రద్దు చేస్తున్నట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ జె.వెంకటసుబ్బయ్య తెలిపారు.దేవస్థానం సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఎనిమిది మందికి పాజిటివ్ రావడంతో ఆలయానికి రెండు రోజులు పాటు ఆలయంతోపాటు పరిసర ప్రాంతాల్లో సోడియం హైపో క్లోరైడ్ తో పిచికారీ చేయడం,బ్లీచింగ్ పౌడర్ చల్లడం జరుగుతుందని భక్తులు భద్రత దృష్ట్యా రెండు రోజుల పాటు దర్శనాలు రద్దు చేస్తున్నామని ఆయన తెలిపారు. స్వామివారికి జరిగే నిత్యకైంకర్యములు  శాస్త్రోక్తంగా ఏకాంతంగా నిర్వహిస్తామని,భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించబడదని భక్తులు సహకరించాలని దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ జె.వెంకటసుబ్బయ్య విజ్ఞప్తి చేశారు.