దగదర్తి లింగాలపాడు చెరువుకు గండి 


హుటా హుటీనా  చేరుకున్న జిల్లా కలెక్టర్


దగదర్తి మండలం లింగాలపాడు చెరువు కు గండి పడి ప్రవాహం గ్రామంలోకి రావడంతో అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్.  చక్రధర బాబు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. చెరువు కళుజు ఉద్ధృతంగా ప్రవహిస్తూ నిర్భయ మార్గం లేకపోవడంతో చెరువు కోతకు గురై నీటి ప్రవాహం గ్రామం లోకి రావడం జరిగిందని,  వెంటనే గ్రామస్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రొక్లైన్  సహాయంతో రోడ్డు కట్ చేసి వరద నీరు పోయేలా  ఏర్పాట్లు చేపట్టినట్లు ఇరిగేషన్ అధికారులు జిల్లా కలెక్టర్ కు వివరించారు.  మండలంలో ఉన్న చెరువుల అన్నిటి పరిస్థితిని అడిగి తెలుసుకొని ఇసుక బస్తాలతో సిద్ధంగా ఉండాలని  జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు. అధికారులు అందరూ మండల కేంద్రంలో ఉండి  తాజా పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉండాలని, …అలాగే ప్రజలకు ఇబ్బంది లేకుండా సహాయక చర్యలను వేగవంతంగా  చేపట్టాలని తెలియజేశారు. 


ఈ పర్యటనలో మండల ప్రత్యేక అధికారి శ్రీ వెంకటయ్య, ఎం.పి.డి.ఓ శ్రీ కళాధర రావు, ఎం.ఈ. ఓ శ్రీ భాస్కర్, ఇరిగేషన్ ఎ. ఇ. హరీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.