చిన్నపిల్లలపై లైంగిక వేధింపుల కేసుల విచారణకు డిస్ట్రిట్ జడ్జి హోదాలో 8 ప్రత్యేక కోర్టులు ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు, కడప, అనంతపురం, పశ్చిమగోదావరి (భీమవరం), గుంటూరు(తెనాలి), కృష్ణ(మచిలీపట్నంలో) 8 కోర్టులు ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఫోక్సో చట్టంకు అనుగుణంగా ఈకోర్టులను ఏర్పాటుచేస్తున్నట్టు న్యాయశాఖ కార్యదర్శి జి.మనోహర రెడ్డి ఉత్తర్వులు విడుదల చేశారు.