- గణతంత్ర దినోత్సవంలో కమిషనర్
నెల్లూరు, జనవరి 26, (రవికిరణాలు) : భారతదేశ 71వ గణతంత్ర దినోత్సవాన్ని నగర పాలక సంస్థ కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. కమిషనర్ పివివిస్ మూర్తి తొలుత మహాత్మా గాంధీ, అంబెడ్కర్ చిత్రపటాలకు నివాళులు అర్పించారు. అనంతరం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. కార్పొరేషన్ సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని, అవినీతిరహిత సమాజానికి తోడ్పాటును అందించాలని సూచించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రయాణికుల ఉచిత వాహనాన్ని ప్రారంభించి, సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ అన్ని శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.