పేద ప్రజల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ లను వెంటనే తెరిపించాలని డిమాండ్ చేస్తూ  గూడూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు సోమవారం ఆందో ళన చేశారు. ప్రభుత్వం అన్నా క్యాంటీన్ లో మూసివేసిన నందుకు నిరసన వ్యక్తం చేస్తూ అన్నా క్యాంటీన్ ఎదుట వంటావార్పు కార్యక్రమం నిర్వహించి పేదలకు ఉచితంగా భోజనాలు పెట్టారు.నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, గూడూరు  మాజీ  శాసన సభ్యులు పాశం సునీల్ కుమార్  ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పేదలకు ఆయన భోజనాలు వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పేదవాడికి ఐదు రూపాయలకే భోజనం పెట్టాలనే ఉద్దేశంతో అన్న కాంటీన్లు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిందని, కానీ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం నిరుపేదల పొట్ట కొట్టే విధంగా అన్న క్యాంటీన్లు మూసి వేయడం సమంజసం కాదన్నారు.అన్నా క్యాంటీన్ కోసం డబ్బులు లేవు అని చెప్తున్నా ప్రభుత్వం... ఆఫీసులకి వైస్సార్ పార్టీ రంగులు వేయడానికి డబ్బులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.  తాను ఎమ్మెల్యే ఉన్నప్పుడు గూడూరు పట్టణంలోని కారు, ఆటో  స్టాండ్లు, ఆర్డీఓ కార్యాలయం, ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే గ్రామీణ ప్రాంతాలకూ చెందిన పెద్దవాళ్ళు కోసం అప్పటి రాష్ట్ర మంత్రి పొంగురు నారాయణ తో మాట్లాడి అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి ,కేవలం 15 రూపాయలకు మూడు పూటలా నాణ్యమైన ఆహారం అందించాము అనీ ఆయన తెలిపారు,  వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్న క్యాంటీన్ లు మూసివేసి పేదల కడుపు కొట్టారు అనీ ఆగ్రహం వ్యక్తం చేశారు, వెంటనే మూసి వేసిన క్యాంటీనులు తెరిచి పేదలకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్నీ డిమాండ్ చేస్తున్నామం అన్నారు.ఈ కార్యక్రమంలో  టీడీపీ నేతలు గోను శివ కుమార్, ఇజ్రాయిల్, బిల్లు చెంచు రామయ్య, వాటం బేటీ శివకుమార్, వెంకటేశ్వర్లరాజు, పులిమి శ్రీనివాసులు, నెల్లబల్లి భాస్కర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు