నెల్లూరు రూరల్ నియోజకవర్గం 25వ డివిజన్ ఇందిరమ్మ కాలనీ మిట్ట ఈ ప్రాంతంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కార్యాలయ ఇంచార్జి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నెల్లూరు నగర కమిషనర్ దినేష్ కుమార్ లు శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ రహదారులతో పాటు మౌలిక వసతులను పరిశీలించారు.. రూరల్ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ కాలనీ మిట్ట ప్రాంతంలో అత్యధికంగా రోజువారి కూలి పనులు చేసుకునే కార్మికులు, పేద ప్రజలు జీవనం సాగిస్తున్నారన్నారు.. ఈ ప్రాంతం ఏర్పడి 10 సంవత్సరాలు గడుస్తున్న ఆశించిన స్థాయిలో అభివృద్ధికి నోచుకోలేదన్నారు. అందుకనే ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు .నెల్లూరు నగర కార్పొరేషన్ కమిషనర్ కు ఈ ప్రాంత సమస్యలను ప్రత్యక్షంగా చూపించే ప్రయత్నం చేసామన్నారు...  25 వ డివిజన్ అభివృద్ధికి ఎక్కువ నిధులు కేటాయిస్తామని కోటం రెడ్డి పేర్కొన్నారు... రూరల్ లోని అన్ని ప్రాంతాల పై పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న  ఎమ్మెల్యే కోటంరెడ్డి డివిజన్ ను ప్రస్తావించినప్పుడు 24వ డివిజన్ గా పేర్కొనడం గమనార్హం... తిరిగి ఆయన 25 వ డివిజన్ గా గుర్తించి మీడియా ప్రతినిధులతో మాట్లాడేటప్పుడు సరిచేశారు*