నెల్లూరు, డిసెంబర్‌ 23, (రవికిరణాలు) : ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా చిరంజీవి యువత పనిచేస్తుందని యువత రాష్ట్ర కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు తెలిపారు నెల్లూరు చిరంజీవి యువత గౌరవ అధ్యక్షుడు రాజకుమార్ జన్మదినాన్ని పురస్కరించుకొని  బాలాజీనగర్ మిత్ర మండలి ఆధ్వర్యంలో గీతామయి వృద్ధాశ్రమంలో సేవకార్యక్రమలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన ఆయన మాట్లాడుతూ చిరంజీవి యువత ఆధ్వర్యంలో నెల్లూరులో జరిగే సేవకార్యక్రమాలకు అన్ని విధాలుగా సహకరిస్తూ యువత సభ్యులను ముందుకు నడపడంలో రాజకుమార్ ది ప్రముఖ పాత్ర అన్నారు..రాజ్ కుమార్ జన్మదినం
సందర్భంగా చేస్తున్న సేవకార్యక్రంలో పాలు పంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం వృద్దులకు అల్పాహారం అందించి, చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వేణు, హనుమంతరావు, రవి శంకర్, ఉదయ్, సురేష్, చందు, శివ తదితరులు పాల్గొన్నారు.