నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ మండలం పోటుపాలెం గ్రామం పంచాయతి పురిటిపాలెం గ్రామం💥


 ♦️
పురిటిపాలెం గ్రామం లో అసంతృప్తి .తారు రోడ్లు నిర్మాణాలు గాలికి 


 ♦️ పురిటి పాలెం  గ్రామాన్ని వెన్నాడుతున్న రోడ్ల సమస్యలు 


 ♦️తారు రోడ్డు మంజూరు అయిన గుంటలుగా కంకర రాల్లకే పరిమితమైన పురిటి పాలెం రోడ్డు మీద గర్భిణి స్త్రీలు హాస్పిటల్  వెళ్ళాలంటే వొళ్లంతా అధిరి మధ్యలోనే ప్రసవించడం అలాగే ఒక వ్యక్తి కి పాము కాటు తెలు కాటు వేస్తే హస్పిటల్ కి తీసుకెళ్లే లోగా చనిపోయే అటువంటి పరిస్తితి 


 ♦️ రోడ్డునిర్మాణాలు పనులు సగానికే ఆగిపోయిన రోడ్డును పట్టించుకునే నాధుడే లేడు 


 ♦️ పురిటిపాలెం గ్రామం  సమస్యలకు . నిలయం చెప్పుకోవచ్చు 


 ♦️ చోద్యం చూస్తున్న  శాఖ అధికారులు 


 ♦️ పురిటిపాలెం గ్రామం నుంచి రోటరీ నగర్ బైపాస్ వరకు తారు రోడ్డు 2.87లక్షలు రుపాయిలతో రోడ్డు మంజూరు  ♦️ రోడ్డు నిర్మాణం పునాదులు వేశారు కంకర తోలారు అక్కడ పరిస్తితి చూస్తే యదా రాజ తథా సితి అన్నట్టే ఉంది 


 ♦️అయినా ఫలితం  శున్యం 


 ♦️ పురిటిపాలెం గ్రామం ప్రజల కష్టాలు తిరేది ఎన్నడూ.. 


 ♦️ పురిటిపాలెం నేతలు రంగంలోకి దిగిన స్పందించని అధికార యంత్రాంగం 


 ♦️జిల్లా కలెక్టర్ గారు పురిటి పాలెం రోడ్లు మరియు స్మశానాినికి గ్రామ ప్రజలు సమస్యల పై దృష్టి సారించండి 


 👉R&B శాఖ అధికారుల నిర్లక్ష్యం.. పాలకుల పట్టింపు లేనితనం పురిటిపాలెం గ్రామానికి శాపంలా మారాయి. 2వేల మందికి పైగా జనాభా ఉన్న పోటు పాలెం పంచాయతి ఈరొడ్డు సమస్య భయం పట్టి పీడిస్తోంది. వర్షాకాలం వచ్చిందంటే.. ఎటు నుంచి వరద ముంచెత్తుతుందోనన్న ఆందోళన గ్రామవాసులను కలవరపెడుతోంది. దీనికి ప్రధాన కారణం.. పురిటిపాలెం గ్రామం ప్రజలు సమస్యలు ను సచివాలయం సిబ్బంది మరియు ఆ యా శాఖ అధికారులు పట్టించుకోకపోవడమే. 


 👉రోడ్డు నిర్మాణం పూర్తి , కాకపోవడం అలాగే  ప్రజలకు కనీసం ఒక వ్యక్తి చనిపోతే పూడ్చడానికి కూడా స్మశానం కూడా లేదు చనిపోయినా వ్యక్తినీ పోడ్చలంటే ఒక మనిషి నిళల్లో మునిగి వెళ్ల వలసిన పరిస్తితి,  పంచాయతీ లసమన్వయ లోపం.. ప్రజలకు కంటి మీద కనుకు లేకుండా చేస్తోంది. వర్షాకాలంలో ముందు జాగ్రత్తగా తీసుకోవాల్సిన చర్యలూ పడకేశాయి. ఆ బాధ్యత తమది కాదంటే.. తమది కాదంటూ రెండు వ్యవస్థలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పురిటి పాలెం గ్రామంలో ప్రదాన తారు రోడ్లు నిర్మాణం 2015లో వచ్చిన వరదలకు ఉన్న రోడ్డు కూడా కొట్టుకో పోయింది అని గ్రామస్థులు చెప్తున్నారు ప్రధాన కారణం ఇదేనని అప్పట్లో పురిటి పాలెం పర్యటించిన జిల్లా కలెక్టర్ గారు  తేల్చి చెప్పినా.. తీసుకున్న చర్యలు నామమాత్రమే అవడం గమనార్హం. 


 💥పత్రాలకే పరిమితం

ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తేనే నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు పురిటిపాలెం గ్రామ ప్రజలు కన్నీటి బాధను చూసి కాస్త కనికరించండి💥


💥కొస మెరుపు💥


👉పురిటిపాలెం గ్రామం తారు రోడ్డు  నిర్మాణం పూర్తి చేయకుండా వదిలేసి తారు రోడ్డు కి వచ్చిననిధులు తిసుకొని నిర్మాణం పూర్తి చేయకుండా ఉన్న కాంట్రాక్టరు మీద R&B అధికారులు మీద మరియు ఆయా శాఖల అధికారులు మీదవెంటనే విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోవాలని గౌరవ 

జిల్లా కలెక్టర్ గారికి పురిటిపాలెం గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు