*🌟 చిల్లకూరు మండలంలో పర్యటన చేసిన మసీదుల కమిటీ*

 *🌟 12 మసీదులను సందర్శించిన కమిటీ*

 *🌟 మసీదుల సమస్యలను కమిటీ దృష్టికి తెచ్చిన గ్రామ మసీదు కమిటీ*

 *🌟 గ్రామాల్లో ముస్లింలకు స్మశానాలు ఏర్పాటు చేస్తాం*

 *🌟 కమిటి అధ్యక్షుడు షేక్ మొబిన్ బాషా వెల్లడి*

 *వార్త✍️మీజూరు మల్లి✍️:  ఇటీవల గూడూరు నియోజకవర్గ పరిధిలోని అన్నీ గ్రామాల్లో ఉన్న మసీదులకు నియోజకవర్గ కమిటీని ఎన్నుకోవడం జరిగింది, కమిటీ ఏర్పడిన తరువాత నియోజకవర్గ మసీదుల అధ్యక్షుడు షేక్ మొబిన్ బాషా ఆధ్వర్యంలో కమిటీ కేడర్, సభ్యులుతో కలిసి శనివారం చిల్లకూరు మండలం లోని 12 గ్రామాల్లో పర్యటించి ఆయా గ్రామంలో ఉన్న గ్రామ మసీదు కమిటీ వారితో మమైకం అయ్యే గ్రామంలో మసీదు సమస్యలు, ముస్లింల సమస్యల ను తెలుసుకున్నారు,అదేవిధంగా గ్రామాల్లో ముస్లింలకు స్మశాన స్థలాలు ఉన్నాయా లెవా  అనీ అరా తీశారు,ఈ సందర్భంగా మొబిన్ బాషా మాట్లాడుతూ  గూడూరు నియోజకవర్గ పరిధిలోని 70 మసీదులకు తనను అధ్యక్షుడుగా  ఎన్నుకున్న గ్రామ మసీదు కమిటీలు వారికి,ముస్లిం సోదరలకు రుణపడి ఉంటాను అనీ ఆయన పేర్కొన్నారు,* 

 *తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించడంతో   మొదటిసారి గా చిల్లకూరు మండలం లోని 12 గ్రామాల్లో పర్యటించి స్థానిక మసీదుల సమస్యలు, ముస్లింలకు గ్రామాల్లో స్మశానాలు ఉన్నాయా లెవా అనే విషయాలపై స్ధానిక ముస్లిం ప్రజలను అడిగి తెలుసుకోవడం జరిగిందని అన్నారు, ముస్లింలు సమస్యలు అన్ని కూడా గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ వెలగపల్లి వరప్రసాద్ రావు, నల్లపరెడ్డి కుటుంబ పెద్దలు, జిల్లా మంత్రులు మరియు రాష్ట్ర ముస్లిం మంత్రులు దృష్టి కి తీసుకెళ్లి వాటిని పరిష్కరించబడం జరుగుతుంది అనీ ఆయన వెల్లడించారు,* 

 *గ్రామాల్లో ముస్లింలకు ఏ సమస్యలు వచ్చిన నియోజకవర్గ ముస్లిం మసీదు ల కమిటీ ముందుకు వచ్చి అండగ నిలవడం జరుగుతుంది అన్నారు, చిల్లకూరు మండలం లో అయ్యవారి పాళెం గ్రామంలో ముస్లింలకు స్మశాన స్థలం లేదు అనీ గుర్తించి వెంటనే ఎమ్మెల్యే తో మాట్లాడడం జరిగిందని తెలిపారు, ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మసీదు కమిటీ ఉపాధ్యక్షుడు అబ్దుల్ రహీం,కార్యదర్శి ఎం డి జిలానీ,ట్రెజరర్ షేక్ జిలానీ,కమిటీ సభ్యులు కాలీషా,అసిల్ భాయ్,షరీఫ్ భాయ్,మస్తాన్ సాహెబ్,అక్బర్,తదితరులు ఉన్నారు,*