స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధి గారి వర్ధంతి సందర్బంగా నెల్లూరు పట్టణంలోని ఇందిర భవన్ లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ చేవూరు దేవకుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు రాజీవ్ గారి చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దేవకుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ మన దేశానికి ఐటి  రంగాన్ని, టెలికాం రంగాన్ని అభివృద్ధి  చేసి దాని ఫలితాల్ని మనకి  అందించిన ఘనత  శ్రీ  స్వర్గీయ రాజీవ్ గాంధీ గారిది.పంచాయతీలకు నిధులను నేరుగా అందించిన ఘనత  శ్రీ రాజీవ్ గాంధి గారిది. యువతకు 18సంవత్సరాలకు ఓటు హక్కును కల్పించిన ఘనత  కూడా  ఆయనదే.అతి చిన్న వయసులోనే తన తల్లి హఠాత్మరణం తో మన దేశం కోసం ఆ బాధ్యతల్ని తన పై వేసుకొని ఆమె బాట లోనే పేద బడుగు బలహీన మైనారిటీ వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన ఘనత రాజీవ్ గాంధీ గారిదే.ఆయన ఆశయాల సాధన కోసం మేము అంత కృషి చేస్తాం అని పేర్కొన్నారు. పై  కార్యక్రమంలో నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ రూరల్ ఇంచార్జి  ఉడతా వెంకట్రావు యాదవ్, కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు  ఏటూరు శ్రీనివాసులు రెడ్డి, బాల సుధాకర్,  లతారెడ్డి, మోహన్ రెడ్డ్,హుస్సేన్ బాషా, మహేష్ రెడ్డి, సిటీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పి. గణేష్ బాబు, రాజేష్ రెడ్డి, తదితరులు  పాల్గొన్నారు.