నెల్లూరు జిల్లాచేజర్ల మండలం మడపల్లి గ్రామంలో యానాదుల(గిరిజన)పై దాడి చేసిన నిందితులు నేతం విష్ణు, వెంకటశేషయ్య లను వెంటనే అరెస్టు చేయాలని యానాదుల(గిరిజన) సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది.

✍️ అగ్రవర్ణాల దాడిలో గాయపడి ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మల్లిక నాగరాజు, ధనుం భాగ్యమ్మను పరామర్శించిన యానాదుల(గిరిజన)సంక్షేమ సంఘం బృందం

✍️ అమాయకులైన యానాదులపై దాడి చేసి, హత్య చేసేందుకు ప్రయత్నించిన నిందితులను పోలీసులు వెంటనే అరెస్టు చేయాలి. లేకపోతే ఆందోళన తప్పదు

ఈ కార్యక్రమంలో యానాదుల(గిరిజన)సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెసి పెంచలయ్య, జిల్లా అధ్యక్షులు BL శేఖర్, మహిళా నాయకురాలు గంధళ్ల వనజ, అంబేద్కర్ ఇండియా మిషన్ నెల్లూరు జిల్లా లీగల్ అడ్వయిజర్ నందా ఓబులేసు పాల్గొన్నారు.