జగనన్న పాలన.. జన రంజకం 


 ⬜2వేల మంది కార్యకర్తలు, ఆభిమానులతో చేగువేరా బృందం ర్యాలీ.. 


🟩 పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్న మండ్ల సురేష్ బాబు.. 


🟦 మంత్రి అనిల్ కుమార్ వెంట చేగువీర సైన్యం 


 ⬜ గూడూరు లో సత్తా చాటిన మండ్ల సురేష్ బాబు 


🟩 మండ్ల సురేష్ బాబు వెంట యువత 


రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్న పాలన జన రంజకంగా ఉందనిన్ వ్య 
చేగువేరా ఫౌండేషవస్థాపకులు, వైసీపీ యువజన నాయకులు మండ్ల సురేష్ బాబు అన్నారు. శనివారం సాయంత్రం రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి డాక్టర్ పీ. అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు స్థానిక అశోక్ నగర్ లోని  అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి రెండువేల మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు, చేగువేరా పైలట్ టీం, మంత్రి అనిల్ కుమార్ అభిమానులతో మేళతాళాల నడుమ భారీ ర్యాలీ నిర్వహించారు.


 ఈ సందర్భంగా మండ్ల సురేష్ బాబు మాట్లాడుతూ మంత్రి అనీల్ అన్న పిలుపుతో భారీ బహిరంగ సభకు రెండువేల మందితో ర్యాలీగా వెళుతున్నట్లు తెలిపారు. జగనన్న పాలనలో ప్రతిఒక్కరూ సంతోషంగా ఉన్నారన్నారు. జగనన్న పరిపాలన స్వర్ణయుగాన్ని తలపిస్తోందన్నారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలలో డాక్టర్ గురుమూర్తిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామన్నారు.


 విద్య, వైద్య రంగాలలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. అనంతరం ర్యాలీ వివేకానంద రోడ్డు మీదుగా ముత్యాలపేట, టవర్ క్లాక్ సెంటర్ కు చేరుకుంది. ఈ కార్యక్రమంలో చేగువేరా ఫౌండేషన్ అధ్యక్షుడు గుండాల ఆదినారాయణ, వైసీపీ నాయకులు మండ్ల రాజేష్ కుమార్, చేగువేరా పైలట్ టీం సభ్యులు, వైసీపీ కార్యకర్తలు, మహిళా విభాగం నాయకులు తదితరులు పాల్గొన్నారు.