తడ బీవీ పాలెం తనిఖీ కేంద్రం వద్ద గంజాయి పట్టివేత.

 

నిందితున్ని అదుపులోకి తీసుకున్న స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారి ఆర్ యు వి ఎస్ ప్రసాద్. 


 నెల్లూరు జిల్లా. తడ బీవీ పాలెం తనిఖీ కేంద్రం వద్ద ఆంధ్ర నుండి తమిళనాడు కి తరలిపోతున్న గంజాయిని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు పట్టుకున్న ఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది.

స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో   ఆర్ యు వి ఎస్ ప్రసాద్ తెలిపిన వివరాల మేరకు 

జిల్లా అడిషనల్ ఎస్పీ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో  ఆదేశాల మేరకు చేపట్టిన వాహన తనిఖీలలొ విజయవాడ నుండి  చెన్నైకు వెళుతున్న ఏపీఎస్  ఆర్టీసీ బస్సులొ   ఒడిస్సా రాష్ట్రానికి చెందిన కె షబ్ మజ్జి అనే వ్యక్తి  తన స్వగ్రామం మట్కా పూర్ లో గంజాయి కొనుగోలు చేసి చెన్నై కి తరలిస్తున్నట్లు అతని నుండి 4  కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు

నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

ఈ దాడుల్లో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్   ఎస్ఐ. రఘు సత్యనారాయణ, హెడ్ కానిస్టేబుల్ చెంచయ్య, , కానిస్టేబుల్స్ వేణు, హరిబాబు, పోలయ్య లు ఉన్నారు.