నెల్లూరు నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఒక నగర సీఐ మధుబాబు ఆధ్వర్యంలో తనిఖీలు.... లాక్ డౌన్ లో భాగంగా నిబంధనలు ఉల్లంఘించి తిరుగుతున్న పలువురు వాహనదారులకు ఆయన తనదైన శైలిలో క్లాస్ ఇచ్చారు... అత్యవసర సేవలకు సంబంధించి మధ్యాహ్నం 1:00 వరకు లాక్ డౌన్ ను మినహాయింపు ఇస్తున్నారని ఆ తర్వాత కూడా రోడ్లపై ఇష్టారాజ్యంగా తిరగటం మంచిది కాదన్నారు. కరోనా మహమ్మారి నేపధ్యంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు