అమ్ముణ్ణి ఆలయం లో చండీ యాగం.

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట కాళంగి నది ఒడ్డున వెలసి ఉన్న భక్తుల కొంగు బంగారం తెలుగు తమిళ ఆరాధ్య దైవం  శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానం లో చండీ యాగాన్ని నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఆళ్ళ శ్రీనివాస రెడ్డి పర్యవేక్షణలో వేదపండితుల మంత్రోచ్ఛారణలతో ఈచండీయాగాన్ని ఘనంగా నిర్వహించారు .ఈ చండీ యాగం సులూరుపేట కు చెందిన సీనియర్ పాత్రికేయులు ఆంధ్రజ్యోతి విలేకరి R.M.V. భాస్కర్ బాబు, శ్రీమతి రాధ దంపతులు వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో మాజీ ధర్మకర్తల మండలి సభ్యులు గోగుల తిరుపాలు,RMV  భాస్కర్ బాబు  బంధువులు పాల్గొన్నారు.