ప్రజా సేవే లక్ష్యంగా పని చేయడం జనసేన పార్టీ విధానమని జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి అన్నారు.ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నెల్లూరు నగరంలోని 4వ డివిజన్ కిసాన్ నగర్ సెంటర్లో స్థానిక నాయకులు జీవన్ ఏర్పాటుచేసిన మజ్జిగ చలివేంద్రాన్ని కేతంరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రోజురోజుకీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా నెల్లూరు నగర వ్యాప్తంగా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని అందులో భాగంగా ఉగాదినాడు ఈ మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు..పేద మధ్య తరగతి ప్రజలకు, బాటసారులకు,ఈ మజ్జిగ చలివేంద్రాలు మరియు మంచినీటి చలివేంద్రాలు ఉపశమనాన్ని కలిగిస్తాయని ఆయన అన్నారు..పవన్ కళ్యాణ్  సేవా స్పూర్తితో జనసేన పార్టీ శ్రేణులు ప్రజలకు ఉపయోగపడే మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చార. కిసాన్ నగర్ సెంటర్లో చలివేంద్రాన్ని  ఏర్పాటు చేసిన స్థానిక నాయకులు జీవన్ మరియు వారి మిత్ర బృందాన్ని కేతంరెడ్డి అభినందించారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కాకు మురళి రెడ్డి,షేక్ ఆలియా, శిరీషా రెడ్డి,మోషే,వెంకట్,హేమంత్ రాయల్, స్థానిక నాయకులు నాసిర్,సాయి,గణేష్,షరీఫ్,మస్తాన్,రెహ్మాన్,రూబీ,కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.