ప్రేయసి కోసం సెల్‌టవర్‌ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు ఓ ప్రేమికుడు. తానూ ప్రేమించిన అమ్మాయి వస్తేనే కిందకు దిగుతానని హల్ చల్ చేశాడు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో రోహిత్‌ అనే యువకుడు తానూ ప్రేమించిన అమ్మాయి కోసం సెల్ టవర్ ఎక్కాడు. ప్రేమించిన అమ్మాయి కోసం సెల్‌టవర్‌ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. అమ్మాయి వస్తేనే కిందకు దిగుతానంటూ రాత్రి నుంచి సెల్‌టవర్‌పైనే కూర్చుని ఆందోళనకు దిగాడు.

బుధవారం ఉదయం ఇన్‌ఛార్జి సీఐ మల్లేశ్వరరావు, సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మాట్లాడదాం కిందకు రావాలని రోహిత్‌ను పిలిచారు. అయితే రోహిత్‌ సెల్‌టవర్‌పై నుంచి కిందకు దిగుతున్న సమయంలో తేనెటీగలు దాడి చేశాయి. దీంతో రోహిత్‌ పక్కనే ఉన్న కల్యాణమండపంలోకి దూకేశాడు. గాయపడిన రోహిత్‌ను జంగారెడ్డిగూడెంహాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.