*విద్యుత్ భవన్ లో ఘనంగా ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ 21వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు*

 *ఈ సందర్భంగా ఎస్ఈ గారు మాట్లాడుతు ప్రతి సంవత్సరం ఏప్రిల్  1 ని ఎస్పీడిసియల్ ఆవిర్భావ దినోత్సవం జరుపు కుంటామని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో పనిచేయుచున్న అధికారులకు, సిబ్బందికి, కాంట్రాక్టు కార్మికులకు, మీటర్ రీడర్స్ కు శుభాకాంక్షలు తెలిపారు* 

**ఏపీ ఎస్పీడిసియల్  ఏర్పడిన తరువాత నెల్లూరు జిల్లాకు నేను12 వ ఎస్ఈ రావడం జరిగింది అని ఈ సందర్భంగా తెలిపారు**

 *ఉమ్మడి రాష్టంలో APSEB(ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలెక్ట్రసిటీ బోర్డ్) ఉండేది. ఏపీ ఎలక్ట్రిసిటీ రిఫామ్స్ యాక్ట్1998 ప్రకారం బోర్డ్ ను 01.02.1999 న ఏపీ ట్రాన్స్ కో,ఏపి జెన్ కో రెండు భాగాలుగా చేయడం జరిగింది**

 *తరువాత కంపెనీ యాక్ట్ 1956 ప్రకారం ఏపీ ట్రాన్స్ కో ను 4 పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్(డిస్కామ్స్) గా విడగొట్టారు(APSPDCL, APCPDCL, APEPDCL, APNPDCL)**

 *ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నెం.37 తేదీ 31.03.2000 (శుక్రవారం) ప్రకారం 6 జిల్లాలతో ఆంద్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ను ప్రకటించారు దాని ప్రధాన కార్యాలయం తిరుపతి లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు**

 *6 జిల్లాల (కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప) గా ఏపీ ఎస్పీడిసియల్ గా ప్రధాన కార్యాలయం తిరుపతి లో ఏర్పాటు చేశారు**

**మొట్టమొదటగా శ్రీ కె.రంగనాధం గారు SPDCL  మేనేజింగ్ డైరెక్టర్ గా నియమితులయ్యారు. వారు 31.03.2000 నుండి 11.08.2015 వరకు పనిచేసారు**

*తరువాత 12.08.2015 నుండి11.08.2010 వరకు శ్రీ పి.గోపాల రెడ్డి గారు సిఎండి గా పనిచేసారు,వారి హయాంలోనే కొత్త కార్పొరేట్ ఆఫీస్,తిరుపతి లో 16.09.2007 లో దివంగత నేత అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వై. యెస్. రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు**

*తర్వాత శ్రీ వి. కృష్ణ మూర్తి గారు12.08.2010 నుండి11.08.2011వరకు, తర్వాత శ్రీ కె.విద్యాసాగర్ రెడ్డి గారు12.08.2011 నుండి11.08.2013 వరకు, తర్వాత శ్రీ హెచ్. వై. దొర గారు 31.08.2013 నుండి 31.08.2017 వరకు సీఎండీ గా పని చేసారు**

 *రాష్ట్ర విభజన 02 జూన్2014 తర్వాత అనంతపురం, కర్నూలు జిల్లాలు ఎస్పీడిసియల్ కలపడం జరిగింది అప్పుడు 8 జిల్లాల ఎస్పీడిసియల్ గా ఏర్పడింది**

**తర్వాత శ్రీ ఎమ్. ఎమ్. నాయక్ ఐఏయెస్ గారు01.09.2017 నుండి08.06.2019 వరకు సీఎండీ గా, ఎం.వెంకటేశ్వర్లు(ఫుల్ అడిషనల్ ఛార్జ్) 08.06.2019 నుండి21.07.2019 వరకు సీఎండీ గా పనిచేసారు**

 *తర్వాత 22.07.2019 నుండి ఇప్పటివరకు శ్రీ హెచ్. హరనాథ్ రావు సీఎండీ గా కొనసాగుతున్నారు*

 *8 జిల్లాల ఎస్పీడిసియల్ నుండి 05.12.2019 న మూడు జిల్లాలు(కృష్ణ, గుంటూరు, ప్రకాశం) విడగొట్టి సీపీడీసీఎల్ ఏర్పాటు చేశారు, ప్రస్తుతం 5 జిల్లాలతో  APSPDCL గా ఉన్నది*

**ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రేగులేరిటీ కమిషన్ ప్రతిపాదించిన టారిఫ్ రేట్స్ ఈ రోజు నుండి అమలవుతాయి అని, ప్రభుత్వం వారు గృహావినియోగదారులకు కనీస చార్జీలు లేకుండా కిలోవాట్ కు10 రూపాయలు తీసుకురావడం మంచి శుభపరిణామం అని దాదాపు జిల్లాలో రెండు లక్షల వినియోగదారులకు మేలు జరుగుతుంది అని(మునుపు కనీస చార్జీలు సింగల్ ఫేస్ వారికి దాదాపు50 రూపాయల వరకు ఉండేదని, త్రీ ఫేస్ వారికి 150 రూపాయల వరకు ఉండేదని)తెలిపారు**

**అలాగే ఫంక్షన్ హాల్స్, కల్యాణ మండపాలు లు కరోన కారణంగా చాలా నష్టం జరిగింది అని వారికి కిలోవాట్ కు ఉపయోగించిన, ఉపయోగించకపోయిన 100 కట్టేవాళ్లు ఇప్పుడు అది లేకుండా చేయడం జరిగింది అని తెలిపారు, వారికి ఇది చాల ఉపయోగం అని తెలిపారు**

**SC, ST కాలనిస్ వారికి200 యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్,లాండ్రీలకు150 యూనిట్స్,బంగారు పనివారికి100 యూనిట్స్, చేనేత వారికి100 యూనిట్స్ వరకు  ఉచిత విద్యుత్ ఇస్తున్నారని తెలిపారు**

**ప్రభుత్వం వారు 2021-22 ఆర్థిక సంవత్సరానికి దాదాపు 9,092 కోట్ల రూపాయలు రాయితీ రూపంలో ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు**

**ఈ కార్యక్రమంలో సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ డి. సురేంద్ర రావు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ రమణా దేవి, అనిల్ కుమార్, రాఘవేంద్ర,రమేష్,సుధాకర్, లక్ష్మి నారాయణ     లు, అకౌంట్స్ ఆఫీసర్స్ మదుకుమార్, మురళి,  డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, అసిస్టెంట్ ఇంజనీర్స్ ,ఏఏఓ లు, ట్రేడ్ యూనియన్ నాయకులు, అసోసియేషన్ రాష్ట్ర, జిల్లా నాయకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు**