రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మంచికంటి శ్యాం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం

 చిరంజీవి యువత నెల్లూరు జిల్లా అధ్యక్షులు మంచికంటి శ్యామ్ ఆధ్వర్యంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా రెడ్ క్రాస్ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. శిబిరంలో వందలాది మంది మెగా అభిమానులు రక్తదానం చేశారు. చిరంజీవి యువత గౌరవాధ్యక్షులు సరయు రాజ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై గత వారం రోజులుగా పలు ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించిన యువతకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో చిరంజీవి యువత రాష్ట్ర నాయకులు కొట్టే వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షులు ప్రసాద్ యాదవ్, డిస్ట్రిబ్యూటర్ హరి, చిరంజీవి యువత రాష్ట్ర నాయకులు కృష్ణారెడ్డి, గుర్రం కిషోర్, హుస్సేన్, శేఖర్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.