బురేవి తుపాను ప్రభావంతో తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి శ్రీవారి ఆలయ ప్రాంతంతోపాటు మాడవీధులు, కాటేజీలు, రోడ్లు, పార్కులు జలమయమయ్యాయి. ఫలితంగా భక్తులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇటీవలి నివర్ తుపాను దెబ్బకు ఘాట్ రోడ్డులో భారీ వృక్షాలు నేలమట్టం కావడంతో అప్రమత్తమైన అధికారులు కొండచరియలు, భారీ వృక్షాలు ఉన్నచోట నిఘాపెట్టారు. మరోవైపు, 'బురేవి' ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న సాయంత్రానికి తమిళనాడులోని పంబన్ పరిసరాల్లో కేంద్రీకృతమైన తుపాను.. పశ్చిమ వాయవ్యంగా పయనించి నేటి ఉదయం తీరే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.