తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా రెండోరోజు విశేషాలు, వాహన సేవల వివరాలు.

ఉదయం. చినశేష వాహనంపై మలయప్పస్వామి

తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండవ రోజులో భాగంగా ఆదివారం ఉదయం మలయప్ప స్వామి ఐదు శిరస్సుల చిన శేషవాహనంపై స్వామి వారు ఊరేగారు. కోవిడ్ కారణంగా ఆలయంలోనే ఏకాంతంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

హంసవాహన సేవ

బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన ఆదివారం రాత్రి మలయప్ప స్వామికి హంస వాహన సేవను నిర్వహించారు. విద్యావాహినిగా అవతారంలో స్వామివారు దర్శనమిచ్చారు.