బ్రహ్మణపల్లిలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో విస్తృత సోదాలు
ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మద్యం రేట్లు విపరీతంగా పెరగడం, కరోనా లాక్ డౌన్ తో కంటైన్మెంట్ జోన్ లలో మద్యం షాపులు మూతపడటంతో నాటుసారా కు మంచి గిరాకీ ఏర్పడింది.. దీంతో జిల్లాలో పలుచోట్ల నాటుసారా కాగుతోంది...ఈ నేపథ్యంలో పొదలకూరు మండలంలోని బ్రహ్మణపల్లి, బిరదవోలు గ్రామాలపై సెబ్ అధికారులు దృష్టి సారించారు...ఈ క్రమంలో గడిచిన వారం రోజులుగా పైన తెలిపిన గ్రామాల సమీపంలోని అటవీప్రాంతంలో రాపూరు సెబ్ టీమ్ సభ్యులు జల్లెడ పడుతున్నారు..సెల్ ఫోన్ సేవలు విస్తృతంగా ఉండటంతో సెబ్ అధికారుల కదలికలను పసిగట్టి కాపు సారా కాసే వాళ్ళు తప్పించుకొని వెళుతున్నారు...అయితే సెబ్ అధికారులు కఠిన హెచ్చరికలు జారీ చేస్తున్నారు...అక్రమ మద్యం తరలింపు, అమ్మకాలు, నాటుసారా తయారీ, విక్రయాలు చేస్తూ దొరికితే నాన్ బెయిలబుల్ సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుందని చెబుతున్నారు.