తాసిల్దార్ ఆదేశాలు బేఖాతరు....                 ఆక్రమిత భూముల్లో హెచ్చరిక బోర్డు తొలగింపు 

ఓజిలి: ఓజిలి మండలం వాకాటి వారి కండ్రిగ గ్రామ రెవిన్యూ పరిధిలో జాతీయ రహదారి కి అతి సమీపంలో ఉన్న సుమారు ఆరు ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించి ట్రాక్టర్ తో  దున్నేసిన  విషయంపై మీడియాలో వచ్చిన వార్తా కథనాలు స్పందించిన ఓజిలి తహసిల్దార్ లాజరస్ జనవరి 6తేదీన ఆక్రమిత భూములలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భూములు ఆక్రమించిన ప్రవేశించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించి బోర్డులు ఏర్పాటు చేశారు. అయితే ఈ బోర్డు ఆదివారం రాత్రి తొలగించి వేశారు. బోర్డు తొలగింపు లో ఎవరెవరికి ఎంతెంత మొత్తం ముట్టిందో? ఎందుకు తొలగించారో? లోగుట్టు పెరుమాళ్ళ కెరుక!?