బెల్టుషాపుల పై పంజా విసిరిన ఎక్సైజ్ సి ఐ జలీల్.

మద్యం, ఇసుక,అక్రమ వ్యాపారం పై పంజా.

నాయుడుపేట పట్టణంలో మూడు బెల్ట్ షాపుల పై కేసులు నమోదు చేసిన ఎక్స్జెంజ్ అధికారులు.కేసు 1: Cr.No:55/2020
నెల్లూరు జిల్లా  నాయుడుపేట పట్టణంలో ఎన్ ఎస్ ఆర్ కాలానికి చెందిన ముళ్ల శేఖర్
తండ్రి చెంచు రామయ్య, అతని వద్ద
 9 సముద్ర గుర్రాల విస్కీని 14 నిప్ బాటిల్స్ ను స్వాదినం చేసుకున్నారు.
కేసు 2: Cr.No:56/2020
అదేవిధంగా రాజగోపాల్ పురంలో కర్ర జనార్ధన్,తండ్రి
 ధనయ్య, అమ్ముతుండగా అతని వద్ద కూడా మందు బాటిల్ ఓల్డ్ టైమర్ డీలక్స్ విస్కీ యొక్క 20 నిప్ బాటిల్స్ ను స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకున్నారు.

కేసు 2: Cr.No:57/2020
లోతువాని గుంట ప్రాంతాల్లో ఉన్న అతురు దిల్లీ బాబు,తండ్రి అమసయ్య,వైన్స్ షాపుల నుండి మందు బాటిల్ తీసుకుని అమ్ముతుండగా అతని దగ్గర ఉన్న 9 సముద్ర గుర్రాల విస్కీ ని  9 నిప్ బాటిల్స్ స్వాధీనం చేసుకుని ముగ్గురు వ్యక్తులపై కేసులు నమోదు చేశామని ఎక్స్జెంజ్ సీఐ తెలిపారు.

నాయుడుపేట ఎక్సేంజ్ సిఐ జలీల్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి లాక్ డవున్ నేపద్యంలో నాయుడుపేట పట్టణం &సర్కిల్ పరిధిలో మరియు ఓజిలి మండలంలో మద్యం బెల్టుషాపులు జోరుగా సాగుతున్నాయని తెలిసింది.

ప్రభుత్వం నిబంధనలు ఆసరాగా తీసుకుని కొందరు వ్యక్తులు సహాయం తో అక్రమంగా మద్యంను విక్రయాలు జరుపుతున్నారు.

మద్యం అమ్ముతున్నా
అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అలాగే జైలుకు పంపుతామని అన్నారు.

ఎవరైనా మద్యం అమ్మకాలు జరిపితే అలాంటి వారిపై మాకు సమాచారం ఇవ్వాలని కోరారు.
 మద్యం బెల్టుషాపులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ జలీల్  హెచ్చరించారు..