టిడిపి నేతల అక్రమ అరెస్టులను నిరసిస్తూ నెల్లూరు టిడిపి కార్యాలయంలో ఏర్పాటుచేసిన బీసీ నేతల రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రసంగిస్తున్న నెల్లూరు మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్... ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికల సమయంలో అనేక హామీలు గుప్పించిన వైఎస్.జగన్మోహన్ రెడ్డి కి  ప్రజలు ఒక అవకాశం కల్పిస్తే టీడీపీ నేతల పై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని విమర్శించారు. బీసీలను టార్గెట్ గా చేసుకొని వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు.  దీనిని బీసీ లందరూ ఐక్యంగా తిప్పికొట్టాలన్నారు. రాష్ట్రంలో సరి కొత్త సంప్రదాయానికి ముఖ్యమంత్రి వైఎస్  జగన్మోహన్ రెడ్డి నాంది పలికారన్నారు. చంద్రన్న బీమా ను రద్దు చేశారని పేద ప్రజలకు మూడు పూటలా కడుపు నింపే అన్న క్యాంటీన్ లను మూసివేశారని ఇలా బీసీలకు వ్యతిరేక విధానాలను వైసిపి అవలంభిస్తోందన్నారు. చేతి వృత్తులను నిర్వీర్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు  అన్ని గమనిస్తున్నారని అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదని వైసీపీ చేస్తున్న కక్షసాధింపు చర్యలకు ప్రజల చేతిలో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో టిడిపి నేత జెడ్ శివ ప్రసాద్, కొండూరు పాల్ శెట్టి, చెంచల్ బాబు యాదవ్  పాల్గొన్నారు