నెల్లూరు, సెప్టెంబర్ 28: రాష్ట్ర శాసనసభ బీసీ కమిటీ చైర్మన్ శ్రీ జంగా కృష్ణమూర్తిని జాయింట్ కలెక్టర్ (ఆసరా) శ్రీమతి రోజ్ మాండ్, డిఆర్వో శ్రీ చిన్న ఓబులేసు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. ఒకరోజు జిల్లా పర్యటనకు విచ్చేసిన బీసీ కమిటీ సభ్యులకు మంగళవారం రాత్రి ఏపీ టూరిజం హరిత హోటల్ లో  జాయింట్ కలెక్టర్ (ఆసరా), డిఆర్ఓ మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. బీసీ కమిటీ చైర్మన్ జంగా కృష్ణమూర్తి తో పాటు రాష్ట్ర సచివాలయ అసిస్టెంట్ సెక్రటరీ శ్రీ ఈశ్వరరావు, సెక్షన్ ఆఫీసర్ శ్రీ భిక్షం, జిల్లా బి.సి.సంక్షేమ అధికారి శ్రీ వెంకటయ్య, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్లు శ్రీ కృష్ణయ్య, శ్రీ సుధాకర్, తేజోవతి, శ్రీదేవి, ప్రసూన తదితర అధికారులు ఉన్నారు.