రాష్ట్ర ముఖ్యమంత్రి వై.


యస్.జగన్ మోహన్ రెడ్డిని మరో అభినవ పూలేగా అభివర్ణించిన భట్రాజు సంఘము రాష్ట్ర అధ్యక్షుడు కురపాటి రామరాజు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పెర్నపాటి శ్రీరామరాజు కొనియాడారు. గురువారం నెల్లూరులోని ప్రముఖ హోటలో పత్రికా విలేకరులతో ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దేశ చరిత్రలోనే మొట్ట మొదటిసారిగా బి.సి.ల గురించి ఆలోచించి వారి స్వావలంబన కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ప్రతి ప్రభుత్వ పధకంలో బి.సి. లకు పెద్ద పీట వేస్తూ, బి.సి.లు వెనుక బడిన వారు కాదు, బి.సి.లు దేశానికి వెన్నెముక లాంటివారని, సంపదలకు సృష్టికర్తలు. 103 బి.సి. కులాలను గుర్తించి, 56 కార్పొరేషన్ చైర్మన్లను, 672 డైరెక్టర్ల లను నియమించి బి.సి.అభివృద్ధి కోరుతూ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించడం అనేది ఒక సువర్ణ అధ్యాయంగా అభివర్ణించారు. నేడు బి.సి.లకు నిజమైన స్వాతంత్ర దినంగా పరిగణించాలని కోరారు. అంతే కాకుండా జగనన్న ఇచ్చిన ఈ బి.సి. లో ఛైర్మెన్ కానీ డైరెక్టర్లు కానీ 50% మహిళలకు కేటాయించడంతో మహిళలపైన తన చిత్త శుద్దిని కొనియాడారు.