టీడీపీ నేతలపై వరుస కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. తాజాగా మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు చింతకాయల అయ్యన‍్న పాత్రుడుపై కూడా కేసు నమోదయ్యింది. నర్సీపట్నం మున్సిపల్‌ కార్యాలయంలో ఆయన తాత లచ్చాపాత్రుడు ఫోటోని మరో గదిలోకి తాత్కాలికంగా మార్చిన క్రమంలో తన పట్ల అయ్యన్నపాత్రుడు అనుచితంగా ప్రవర్తించారని నర్సీపట్నం మున్సిపల్‌ కమిషనర్‌ కృష్ణవేణి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దాంతో కృష్ణవేణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా లచ్చాపాత్రుడు ఫోటోను మున్సిపల్‌ సిబ్బంది మార్చడంతో గత రెండు రోజుల క్రితం మున్సిపల్‌ కార్యాలయం దగ్గర అయ్యన్నపాత్రుడు నిరసన తెలిపారు. ఇక సీనియర్ నేతగా ఉన్న అయ్యన్నపాత్రుడు గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసి ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ సోదరుడు ఉమాశంకర్ గణేష్ చేతిలో ఓటమిచెందారు.