విలక్షణ శైలికి పెట్టింది పేరు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. ఐదు శాఖలకు మంత్రిగా  రకరకాల కార్యక్రమాలతో  బిజీ షెడ్యూల్ లో ఉన్నా తనకోసం పని చేసేవారిని కూడా కుటుంబంలా భావించి సమయాన్ని వెచ్చించడం ఆయనకే సాధ్యమని మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. తాజాగా బుధవారం తన ప్రోటో కాల్ వెహికిల్ కు డ్రైవర్ గా విధులు నిర్వహించే పాపారావు కుమార్తె అనుదీప్తి వివాహానికి హాజరై అక్కడివారందరినీ ఆశ్చర్యపరిచారు. తాడేపల్లిలో జరుగుతున్న పెళ్లి వేడుకల్లో పాల్గొని మంత్రి గౌతమ్ రెడ్డి సందడి చేశారు. సరదాగా సంభాషిస్తూనే గౌరవించి, ప్రేమగా  పలకరించే మంత్రి మేకపాటిగారు , తన కుమార్తె పెళ్లికి ఆహ్వానించగానే వచ్చి ఆశీర్వదించడం మరచిపోలేని సంతోషమని  పాపారావు దంపతులు పేర్కొన్నారు. గతంలోనూ మంత్రి మేకపాటి కానూరులోని తన నివాసానికి వెళుతున్నప్పుడు తల్లిని కోల్పోయిన రమ్యశ్రీ అనే చిన్నారికి సంబంధించిన వేడుకల్లోనూ పాల్గొని ఆశీర్వదించి ఆశ్చర్యచకితుల్ని చేశారు. తన ఆత్మకూరు నియోజవర్గంలోని బీఎస్ఆర్ సెంటర్ లో ఎన్నో ఏళ్లుగా పరిచయమున్న టీ స్టాల్ యజమాని రజాక్ ని పలకరించి ఆయన పెట్టిన ఛాయ్ ని రోడ్డు పక్కనే నిలబడి తాగడం కూడా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హుందాతనానికి, లోతైన ప్రేమకు నిదర్శనం. తన కోసం పని చేసేవారి పట్ల మంత్రి మేకపాటికి ఉండే ప్రత్యేకమైన అభిమానం ఆయనకోసం పని చేసేవారి కొండంత ధైర్యమని చెప్పకనే చెబుతున్నాయి.