నెల్లూరు జిల్లా... దొరవారిసత్రం మండలం


💥నెల్లూరు జిల్లాలో మరో విషాదం💥


💥మోదుగులపాలెం లో విషాదం, కుటుంబ కలహాల నేపథ్యంలో ఒకే కుటుంబంలోని ముగ్గురు బలవన్మరణా


నికి పాల్పడగా అందులో ఇద్దరు చనిపోగా ఒక పాప పరిస్థితి విషమంగా ఉంది💥


నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలం లో కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో కుటుంబం మొత్తం విషం సేవించిన ఘటనలో   మేర్లపాక మురళి (40) అనే వ్యక్తి,అతని అమ్మ  మస్తానమ్మ(60)  చనిపోగా  కుమార్తె కావ్య శ్రీ(11) ఆస్పత్రిలో విషమ పరిస్థితుల్లో ఉన్నట్టు సమాచారం....


మేర్లపాక మురళి ఇంట్లో ఏదో శబ్దాలు రావడంతో ఇది గమనించిన స్థానికులు ఇంటిదగ్గర కి వెళ్ళి  చూడగా అప్పటికే మస్తానమ్మ(60) చనిపోయి ఉండి ,మురళి(40) కావ్య శ్రీ(11) కొన ఊపిరితో ఉండడంతో వీరిని హుటాహుటిన సూళ్లూరుపేట ఆసుపత్రికి తరలించగా అక్కడ ఆసుపత్రిలో మురళి చనిపోయినట్టు మెరుగైన వైద్యం కోసం కావ్య శ్రీ ని నెల్లూరు ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం,, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను సేకరించే పనిలో పోలీసు వారు వున్నారు...