నెల్లూరుజిల్లా నాయుడుపేట:-

"ఆరోగ్యశ్రీ కార్డు సహిత కుటుంబమే లక్ష్యం" ఆరోగ్యశ్రీ టీం లీడర్ బూరగ నాగేంద్ర.

 నాయుడుపేట పరిధిలో గల ఆరోగ్య మిత్రులతో నేడు టీమ్ లీడర్ సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మిత్రాలతో మాట్లాడుతూ
 ప్రతి గర్భిణీ స్త్రీకి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచిత వైద్యం మరియు ఆరోగ్య ఆసరా డబ్బును అందించాల్సిన బాధ్యత మిత్రాలదే అని తెలిపారు.
108సేవలను విరివిగా ఉపయోగించుకోవాలని, డివిజన్లో గల ప్రతి నిరుపేద కుటుంబానికి పథకం యొక్క ఉచిత సేవలు అందాలి, అందుకుగాను ప్రతి మిత్ర కృషి చేయాలని తెలిపారు.
 జిల్లా ఆరోగ్యశ్రీ సమన్వయకర్త డాక్టర్ చంద్రశేఖర్ గారి ఆదేశాల మేరకు మన జిల్లాను రాష్ట్రంలోనే ఆరోగ్యశ్రీ ద్వారా అత్యున్నత సేవలు అందిస్తున్న జిల్లాగా ఉంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఆరోగ్యశ్రీ సిబ్బంది మీద ఉందని గుర్తు చేశారు.