ఆక్వా రంగాన్ని ఆదుకుంటాం
జిల్లా కలెక్టర్ చక్రధర బాబు

కోవిడ్ -19 ప్రభావంతో నష్టపోయిన ఆక్వా రంగాన్ని ఆదుకునేందుకు తమవంతు చేయూత ఎప్పుడూ ఉంటుందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.నెల్లూరు నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గురువారం మత్యశాఖ అధికారులు, ఆక్వా పరిశ్రమ యజమానులతో  సమావేశం నిర్వహించారు. కోవిడ్ -19 ప్రభావంతో ఆక్వా పరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కొందని వాటిని అధిగమించేందుకు తమ వంతు సహకారం ఉంటుందని ఆక్వా యజమానులకు కలెక్టర్ భరోసా నిచ్చారు. ఆక్వా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానన్నారు. ఆక్వా పరిశ్రమలో పనిచేసే కార్మికుల భద్రతకు సంబంధించి, యజమానులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పనిచేసే సమయంలో మాస్కులు ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం చేయాలన్నారు.