సొంత వైద్యం.. నిర్లక్ష్యం వద్దు.... ఏమాత్రం అనుమానం వచ్చిన కోవిడ్ ఆసుపత్రులకు రండి* జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి.  కోవిడ్ లక్షణాలు ఉన్న కొందరు చాలా ఆలస్యంగా కోవిడ్ ఆసుపత్రిలో చేరుతున్నారని ..దీంతో నెల్లూరు నగరంలో మరణాల సంఖ్య కూడా అదే స్థాయిలో ఉందని జాయింట్ కలెక్టర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు... ఎవరు కూడా సొంత వైద్యం వైపు వెళ్లకుండా అనుమానం కలిగిన వెంటనే ఆసుపత్రులకు రావాలని సూచించారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 18 అంబులెన్సులు  సిద్ధం చేసామన్నారు. కొంతమంది అపార్ట్మెంట్లలో ఉన్నవారు కోవిడ్ లక్షణాలు ఉన్న నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. జ్వరము,దగ్గు ఉన్న వెంటనే అప్రమత్తం కావాలన్నారు.ఆక్సీ మీటర్ లో ప్రతి ఒక్కరూ పరీక్షించుకుని 94  ఆక్సిజన్ శాతం తగ్గితే డేంజర్ లో ఉన్నట్లేనని.. వెంటనే ఆస్పత్రులకు రావాలన్నారు... పాజిటివ్ , నెగిటివ్ తో పనిలేదని నేరుగా అడ్మిషన్ ఇస్తామన్నారు. మూడు లక్షణాల్లో రెండు ఉన్న వెంటనే విద్యావంతులు స్పందించి ప్రజల్లో అవగాహన కల్పించి వారిని కోవిడ్ ఆసుపత్రులకు పంపించాలన్నారు.. నిర్లక్ష్యం వల్ల 37 సంవత్సరాల వ్యక్తి కూడా చనిపోయారని... లక్షణాలు ఉన్నవారు ఏ మాత్రం అశ్రద్ధ వచించవద్దన్నారు