కావలి
శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నెల్లూరు జిల్లా కలెక్టర్ ను వారి క్యాంపు కార్యాలయంలో బుధవారం భేటీ అయ్యారు కావలి నియోజకవర్గంలోని పలు సమస్యలను కలెక్టర్  దృష్టికి తీసుకొని  వచ్చారు.

 గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా కావలి చెరువులకు సోమశిల జలాలు అందించి కావలి  ప్రజలు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ గారిని ఎమ్మెల్యే  కోరారు

 అలాగే కావలి ఏరియా హాస్పిటల్ నందు మౌలిక వసతులకు నిధులు విడుదల చేయవలసిందిగా ఎమ్మెల్యే  కలెక్టర్  ను కోరారు

 దగదర్తి లోని రెవెన్యూ రికార్డులను సరి చేయుట కు ప్రత్యేక చొరవ చూపాల్సిందిగా ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారిని కోరారు

 దామవరం ఎయిర్పోర్టు నిర్మాణమునకు  అభ్యంతరము గా ఉన్న భూ సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఎమ్మెల్యే  కలెక్టర్ ను కోరారు