నెల్లూరుజిల్లాలోని వింజమురు మండలంలోని శ్రీ వెంకట నారాయణ యాక్టివ్ ఇంగ్రిడియంట్స్ కెమికల్ ఫ్యాక్టరీలో  రియాక్టర్ ట్యాంక్ పేలింది. దీంతో ఒక్కసారిగా రాజుకున్నాయి. ఈ ప్రమాదంలో Sd.. ఆఫీజ్(ఆత్మకూరు)
2).B. రవికుమార్ (వింజమూరు)
3).N. రజినీకాంత్ (అభి పురం.. ఏఎస్ పేట మండలం)
4)S. భాస్కర్ (అభి పురం.. ఏఎస్ పేట మండలం) అనే నలుగురు కార్మికులకి తీవ్ర గాయాలైయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉండటంతో నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కనీస ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానిక గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలోని కెమికల్ ఫ్యాక్టరీ లలో వరుస ఘటనలు జరుగుతున్నాయి..