కోడి పందాల స్థావరంపై సీ.ఐ మెరుపు దాడి.. ఇద్దరు అరెస్టు.


పొదలకూరు

 

మండలం ఎర్రబల్లి అటవీ ప్రాంతంలో కోడి పందాలు ఆడుతున్న ఇద్దరు జూదరులను


పొదలకూరు సీ.ఐ జీ.గంగాధర రావు అదుపులోకి తీసుకుని  పోలీస్ స్టేషన్ కు తరలించారు. కోడి పందాల స్థావరంపై దాడిచేసి ఇద్దరు పందెం రాయళ్ళను , రెండు కోళ్ళలను అదుపు లోకి తీసుకున్నారు.ఈ సందర్భంగా సీ.ఐ. మాట్లాడుతూ పేకాట , కోడిపందాల స్థావరాలపై ప్రతిరోజు నిఘా పెడుతున్నామని జూదాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని ఆయన హెచ్చరించారు.

కోడి పందేలు, ఇతర జూదాల నిర్వహణపై హైకోర్టుతో పాటు ప్రభుత్వం కూడా నిషేధం విధించిందన్నారు. ఎవరైనా బరులను సిద్ధం చేసినా, పందేల నిర్వహణకు ఏర్పాట్లు చేసినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.సర్కిల్ పరిధిలో దొంగచాటుగా నిర్వహించే కోడి పందెలాపై సమాచారం తెలిసిన వారు ఎప్పటికప్పుడు  పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు