గూడూరు పట్టణానికి చెందిన


ప్రముఖ సీనియర్‌ పాత్రికేయులు,ఆంధ్రజ్యోతి ఆర్ సి ఇంచార్జ్ నార్ల మల్లికార్జున రావు(54) శనివారం మధ్యాహ్నం నెల్లూరు నగరంలోని  బొల్లినేని ఆసు పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మాజీ కేంద్రమంత్రి, టీడీపీ తిరుపతి ఎంపీ అభ్యర్థి డాక్టర్ పనబాక లక్ష్మీ,టీడీపీ సీనియర్ నాయకులు డాక్టర్ పనబాక కృషయ్య సంతాపం ప్రకటించారు,ఎంతో సౌమ్యుడుగా ఉంటూ అందరిని అప్యా యంగా పలకరించి సీనియర్‌ పాత్రికేయుడు నార్ల మల్లికార్జున రావుమృతి చెందడం బాధకరమని వారు వెల్లడించారు, ఆయన ఆత్మకు శాంతి చేకూరలి అనీ భగవంతుని ప్రార్ధిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.