కావలి పరిధిలోని ఆముదాల దిన్నే గ్రామ సచివాలయంని జిల్లా పంచాయతీ అధికారి ధనలక్ష్మి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె రికార్డులను పరిశీలించారు. సచివాలయం పరిధిలో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల అమలు తీరును పరిశీలించి స్థానిక సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా త్వరితగతిన సేవలు అందించాలని  ఆమె సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన వేళల్లో సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. బయోమెట్రిక్ అటెండెన్స్ వివరాలు,  ఈ సర్వీసెస్,  స్పందన ఫిర్యాదులు తదితర అంశాలపై ప్రధానంగా దృష్టి సారించారు