నెల్లూరు నగరంలోని నూతన జిల్లా పరిషత్ ప్రాంగణంలోని డి.ఈ.ఓ.సీ నందు శనివారం ఉదయం
కలెక్టర్ శ్రీ ఎం.వి.శేషగిరి బాబు..., స్వాతంత్ర్య సమర యోధుడు, మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రలో తెలుగు నాట ఆంగ్లేయులను గడగడలాడించిన మహోజ్వల శక్తి, మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు అని.., ఆయన
దేశభక్తి, ధైర్యాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
భారతదేశాన్ని పాలిస్తున్న బ్రిటీష్ వారిని దైర్యంగా ఎదుర్కొని, అల్లూరి సీతారామరాజు స్వతంత్ర్యోద్యమ పోరాటాన్ని సాగించారని, ఆయన చూపిన తెగువను, ధైర్యాన్ని, నిబద్ధతకు యువతరం ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీ ఎన్. ప్రభాకర్ రెడ్డి, ఆర్.డి.ఓ, అధికారులు పాల్గొన్నారు.